Search songs

Translate

27 Feb 2023

Nuvvostanante Nenoddantana Video Song Lyrics | Aakasam Thakela Video Song | Siddharth Lyrics

Nuvvostanante Nenoddantana Video Song Lyrics | Aakasam Thakela Video Song | Siddharth Lyrics - SPB


Nuvvostanante Nenoddantana Video Song Lyrics | Aakasam Thakela Video Song | Siddharth
Singer SPB
Composer DSP
Music DPS
Song Writer

Lyrics

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల

అందించే ఆహ్వానం ప్రేమంటే

ఆరాటం తీరేలా బదులెచ్చే గగనంలా

వినిపించే తడిగానం ప్రేమంటే



అనువనువును మీటే మమతల మౌనం

పదపదమంటే నిలవదు ప్రాణం

ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం



దాహంలో మునిగిన చివురుకి చల్లని తన చై అందించి

స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే

మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించీ

మాగానీ ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే



ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో

గుర్తించేదుకు వీలుందా

ప్రణయం ఎవరి హ్రుదయంలో ఎపుడు ఉదయిస్తుందో

గమనించే సమయం ఉంటుందా



ప్రేమంటే ఎమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే

ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే

అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం

సరిగమలెరుగని మదురిమ ప్రేమంటే



దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా

తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే

సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా

తనలో కనిపించే కలలకు తొలిపిలుపేదంటే



మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది

స్వర్ణమంటు చూపాలంటే

పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే

చేసిన మేలంటే



తనువంతా విరబూసే గాయాలే వరమాలై

దరిజేరే ప్రియురాలే గెలుపంటే



తను కొలువై ఉండే విలువే ఉంటే

అలాంటి మనసకు తనంత తానే

అడగక దొరికే వలపే ప్రేమంటే



జన్మంతా నీ అడులతో అడుగులుకలిపే జత ఉంటే

నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా

రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే

ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా




Nuvvostanante Nenoddantana Video Song Lyrics | Aakasam Thakela Video Song | Siddharth Watch Video

Popular Posts