Nuvvu Nuvvu Full Song lyrics || Khadgam Movie || Srikanth, Sonali Bendre, Sangeetha Lyrics - Sumangali

Singer | Sumangali |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Sirivennela Sitarama Sastry |
Lyrics
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు
నా మెడ వొంపున నువ్వు
నా గుండె మీద నువ్వు
వొళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు
ముద్దేసే నువ్వు
నిద్దరలో నువ్వు పొద్దుల్లో నువ్వు
ప్రతి నిమిషం నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు
నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వు
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నా సిగ్గుని దాచుకొనే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
కమ్మని స్నేహం నువ్వు నువ్వు
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
మైమరిపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వు
నా పంతం నువ్వు
నా సొంతం నువ్వు
నా అంతం నువ్వు ....
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...