Search songs

Translate

5 Feb 2025

Kanti Papa song lyrics (Telugu) - Vakeel Saab Lyrics Lyrics - Armaan Malik, Deepu & thaman S

Kanti Papa song lyrics (Telugu) - Vakeel Saab Lyrics Lyrics - Armaan Malik, Deepu & thaman S


Kanti Papa song lyrics (Telugu) -  Vakeel Saab Lyrics
Singer Armaan Malik, Deepu & thaman S
Composer Thaman S
Music Thaman S
Song WriterRamajogayya Sastry

Lyrics

Kanti Papa Kanti Papa Song Lyrics in Telugu

కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే
నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా… సవ్వడైనా లేదే
నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా

నీరాక ఏరువాక… నీ చూపే ప్రేమలేఖ
నీలో నువ్వాగిపోకా… కలిసావే కాంతి రేఖ
అంతులేని ప్రేమ నువ్వై … ఇంత దూరం వచ్చినాక
అందమైనా భారమంతా… నాకు పంచినాకా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు

 

కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదే
నువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నా

సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా

సుదతీ సుమలోచినీ సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిణీ కరుణాగున భాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

 

సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా

ఎదలో ఏకాంతము… ఏమయ్యిందో ఏమిటో
ఇదిగో నీ రాకతో… వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా… నీకో స్నేహితుణ్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా

ఆకాశం గొడుగు నీడ… పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండా… ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై… ఏ క్షణాన్ని వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం… గుండె చోటు నిండా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు



Kanti Papa song lyrics (Telugu) - Vakeel Saab Lyrics Watch Video

Popular Posts