Nuvvostanante Nenoddantana Video Song Lyrics | Aakasam Thakela Video Song | Siddharth Lyrics - SPB Singer SPB Composer DSP Music DPS Song Writer Lyrics ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులెచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అనువనువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకి చల్లని తన చై అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించీ మాగానీ ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేదుకు వీలుందా ప్రణయం ఎవరి హ్రుదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఎమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మదురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలిపిలుపేదంటే మండే కొలిమినడగందే తెలియదే మన్ను
Song Lyrics & Movie Reviews