Amma Paata 2024 Full Song lyrics| Mittapalli Surender | Amma Songs Telugu | Mittapalli Studio Lyrics - Janhavi Yerram

Singer | Janhavi Yerram |
Composer | Sisco Disco |
Music | Sisco Disco |
Song Writer | Surender Mittapalli |
Lyrics
పల్లవి : అమ్మపాడే జోలపాట
అమృతానికన్నా తియ్యనంట
అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి
ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే
నూరేళ్ల నిండు దీవెన చరణం కురిసే వాన చినుకులకి
నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి
నేలతల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకోమ్మ
అమ్మ ప్రకృతిపాడే పాటలకి యలకోయిల అమ్మ సృష్టికి మూలం
అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం
సృష్టించలేనిది అమ్మ గుణం చరణం
నింగిని తాకే మేడలకి పునాది రాయి
అమ్మ అందంపొందిన ప్రతి శిలకి
ఉలిగాయం అమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ అమ్మంటే
అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని