Ranganayaki song Lyrics | Narne Nithiin, Nayan Sarika | RamMiriyala | AnjiKManiputhra | #AAY Movie Lyrics - Anurag Kulkarni

Singer | Anurag Kulkarni |
Composer | Ram Miriyala |
Music | Ram Miriyala |
Song Writer | Suresh Banisetti |
Lyrics
పొట్టేల్ ని గన్న తల్లి…
హెయ్, గొర్రె గొర్రె గొర్రె
తన బోటుకి చిన్న చెల్లి
అది బర్రె బర్రె బర్రె…
అరె చాపను చూస్తే కొంగ
అహ వెర్రే వెర్రే వెర్రే
కోడిపెట్టెను జూసి పుంజు
హ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్)
అహ, బూరెలేసే బుజ్జి పద్మావతి, ఓహో
బంగార్రాజు పులిహోర కలిపాడు, ఆహ
పూలు అల్లుతున్న చిట్టి కుమారికి
కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు
ముగ్గులు పెట్టే ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు, ఆహా
మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
ఓ హో హో హో
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కో: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
కో: ఆహ, ఓహో… ఆహ, అది ఓహో
ఆహ, ఓహో అరరరె అదీ లెక్క
చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
ఓ ఓ, చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు, అరెరె
స్వాతిముత్యాలు కొంచెం ఆహ
పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేళ్లు, ఓ
మీసం మెలేసినా ప్రతి ఒక్క కుర్రాడు
కాటుక కళ్ళే చూసి ఫ్లాటైపోతాడు
గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు
భూమి దున్నాడంటే నమ్మేదెవ్వడు
మూర మల్లెపూలు కొప్పున చుడితే, ఓహో
ఊరూరంతా నిద్దుర లేసింది, ఆహ
బెత్తెడు నడుము అత్తరు కొడితే
పొలిమేర కూడా పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే
కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది
నాయకి (నాయకి)
ఓ మరి, నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే, ఓ ఓ ఓ
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కో: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే