మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు
కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు
పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు
జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు
తీరినట్టి భారమంత ... ఓ ఇంకా
తెల్లతెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంత
చల్లబువ్వలోన నంజుకుంటూ తిన్న ఆవకాయ కారమంత
పెళ్ళి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత
Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So Much ..
హే అందమైన నీ కాలికింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తొణికే గాలికున్న గతమంత
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత
Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So Much ..
పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత
కుంబకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత..
Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So Much ..
పచ్చి వేపపుల్ల చేదు అంత రచ్చబండ పైన వాదనంత
అర్ధమైనా కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోన జాబిలంత ఏట ఏట వచ్చే జాతరంత
ఏక పాత్రలో నాటకాలలో నాటు గోలలంత
Baby He Loves You Loves You
Loves You So Much
Baby He Loves You Loves You
Loves You So Much ..
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లు పడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
హో బిక్కు బిక్కుమంటూ పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైనా సవాలు చేసే ఆటగాడి పొగరంత
Baby He Loves You Loves You
Loves You So Much
Baby Baby He Loves You Loves You
Loves You Too Much ...
ఎంత దగ్గరైనా నీకు నాకు మద్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైనా నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున్నా నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైనా హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత
Baby He Loves You Loves You
Loves You So Much
Baby Baby He Loves You Loves You
I Love You So Much ..