Nenunnanu | Nenunnanani Song lyrics | Nagarjuna, Aarti, Shriya | Sri Balaji Video Lyrics - M.M.Keeravani & Sunitha

Singer | M.M.Keeravani & Sunitha |
Composer | M M Keeravaani |
Music | M M Keeravaani |
Song Writer | Chandrabose |
Lyrics
చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని
తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కెళ్లాలని
కన్నుల నీటిని కళల సాగుకై వాడుకోవాలని
కాల్చె నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని
గుండె తో ధైర్యం చెప్పెను
చూపు తో మార్గం చెప్పెను
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని
ఎవ్వరు లేని ఒంటరి జీవి కి తోడు దొరికిందని
అందరు ఉన్న ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మ కు ఏరగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని
చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని