Search songs

Translate

Showing posts with label Rangamma Mangamma Full Song lyrics. Show all posts
Showing posts with label Rangamma Mangamma Full Song lyrics. Show all posts

4 Jul 2024

Rangamma Mangamma Full Song lyrics| Rangasthalam Video Songs |Ram Charan, Samantha Lyrics - MM Manasi

Rangamma Mangamma Full Song lyrics| Rangasthalam Video Songs |Ram Charan, Samantha Lyrics - MM Manasi


Rangamma Mangamma Full  Song lyrics| Rangasthalam Video Songs |Ram Charan, Samantha
Singer MM Manasi
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterLyricist: Chandrabose

Lyrics

ఓయ్ రంగమ్మా మంగమ్మా ...

 రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ

పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ

రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ

పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ

గొల్లభామ వచ్చీ ... నా గోరు గిల్లుతుంటే...

గొల్లభామ వచ్చీ నా గోరు గిల్లుతుంటే...

పుల్ల చీమ కుత్తి నా పెదవి సలుపుతుంటే

ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటు ఊదడూ

ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడూ

ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటు ఊదడూ

ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడూ

ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోనా మునిగితేలుతుంటే

మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే

మంటమ్మా మంటమ్మా అంటె సూడదూ

మంచినీల్లైనా సేతికియ్యడూ

మంటమ్మా మంటమ్మా అంటె సూడదూ

మంచినీల్లైనా సేతికియ్యడూ

ఓయ్ రంగమ్మా మంగమ్మా ...

రంగమ్మా మంగమ్మా ...

రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ

పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ

చరణం 1:

హే..... రామ చిలకమ్మా రేగిపండు కొడుతుంటే

రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైకమీద పడుతుంటే

హే..... రామ చిలకమ్మా రేగిపండు కొడితే

రేగిపండు గుజ్జు నా రైకమీద పడితే

మరకమ్మా మరకమ్మా అంటె సూడడూ

మారు రైకైనా తెచ్చి ఇయ్యడూ

మరకమ్మా మరకమ్మా అంటె సూడడూ

మారు రైకైనా తెచ్చి ఇయ్యడూ

రంగమ్మా మంగమ్మా ...

రంగమ్మా మంగమ్మా ...

రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ

పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ

చరణం 2:

నా అందమంట మూటకట్టీ

అరె కందిసేనుకే యెలితే

ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి

నన్ను సుట్టుముడుతుంటే

నా అందమంత మూటకట్టి కందిసేనుకెడితే

కందిరీగలొచ్చి నన్ను సుట్టుముడుతుంటే

ఉష్షమ్మా ఉష్షమ్మ అంటు తోలడూ

ఉలకడూ పలకడూ బండరాముడూ

ఉష్షమ్మా ఉష్షమ్మ అంటు తోలడూ

ఉలకడూ పలకడూ బండరాముడూ

రంగమ్మా మంగమ్మా ...

రంగమ్మా మంగమ్మా ..

హోయ్... రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ

పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ

రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ

పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడూ


Rangamma Mangamma Full Song lyrics| Rangasthalam Video Songs |Ram Charan, Samantha Watch Video

Popular Posts