Chinni Chinni Aasalu Full Song lyrics|| Manam Video Songs || Nagarjuna, Shreya Lyrics - Ashwin, Hari, Shreya Ghoshal

Singer | Ashwin, Hari, Shreya Ghoshal |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer | Chandrabose |
Lyrics
హో.. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
ఏం చేయనూ.. ఏం చేయనూ.. ఏం చేయనూ..
తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే
తొలి అడుగు నీకై సాగెనే.. హో..హో..హో..
తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే
ఈ మాట నాలో దాగెనే.. హే.. హే..
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే..
ఓ యాయాయా.. ఓ యాయాయా.. యాయాయా.. యాయా యాయాయా..
ఓ ఐ లవ్ యూ.. ఆ.. ఐ లవ్ యూ.. ఆ..
ఐ లవ్ యూ.. అంటే.. ఇలా ఇవ్వు.. ఇలా ఇవ్వు..
హో.. ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
స్నేహము ప్రేమ రెండు నావే..
ఓహో.. వెలుగుతో వచ్చానే నీడలా మారానే
వెలుగు నీడల్లో తోడు నీవే..
గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే
గుండె తడి నీవయ్యావులే..
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే..
హో.. నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే
బహుమతిచ్చావే జీవితాన్ని
ఓ... ఇద్దరై ఉన్నామే ఒక్కరై ఒదిగామే
ముగ్గురై పోయె ముద్దు లోనే..
ప్రేమనే పంచావే పాపలా చూసావే
మన ప్రేమ పాపయ్యిందిలే..
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో..
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే..
హో.. చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
ఓ.. చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే
ఏం చేయనూ..
తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే
ఈ మాట మాలో మోగెనే.. హే.. హే..
చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హోహో
చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే